
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
కురిచేడు ఎస్ఐ గారు మరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు జూద స్థావరంపై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి జూదానికి వినియోగిస్తున్న రూ.51,000/- నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. జూదం, బెట్టింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ప్రజలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కురిచేడు పోలీసులు సూచించారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.