
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఒంగోలు నగరం త్రివర్ణ శోభితమైంది. గురువారం ఉదయం విద్యార్థులు, వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది, ప్రజలు, స్థానిక ప్రముఖులు కలిపి సుమారు 3 వేల మంది జాతీయ పతాకాలను చేతబూని భారీ ర్యాలీలో పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి నేతృత్వంలో ప్రకాశం భవన్ నుంచి మినీ స్టేడియం వరకు సాగిన మారథాన్ ర్యాలీతో ట్రంక్ రోడ్ కిక్కిరిసింది. వివిధ యూనిఫారాలు ధరించిన విద్యార్థులు, సిబ్బంది ‘వందేమాతరం’ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.మినీ స్టేడియంలో జరిగిన ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ, ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామన్నారు. ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.‘వికసిత భారత్–2047’, ‘స్వర్ణాంధ్ర–2047’ లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని, ముఖ్యంగా యువత చురుకైన పాత్ర పోషించాలని సూచించారు. స్వాతంత్య్ర పోరాట విలువలను భావితరాలకు తెలియజేసేలా హర్ ఘర్ తిరంగా, సెల్ఫీ కార్యక్రమాలు, మొక్కలు నాటడం, తిరంగా ర్యాలీలు వంటి కార్యక్రమాలను ఐదు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డీఆర్వో పి.వి. రమణ, జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్డీఏ పీడీ నారాయణ, డీఈవో రేణుక, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఐసీడీఎస్ పీడీ పద్మ సునంద, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, స్టెప్ సీఈవో రమణ, జిల్లా స్వర్ణ గ్రామ-వార్డు సచివాలయాల నోడల్ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పర్యాటక అధికారి రవికుమార్, భూగర్భ జలవనరుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు, డీటీసీ సుశీల, డీఎస్పీ శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ సూపర్వైజర్ ఫణి కుమార్, మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణయ్య, డీఎస్డీవో రాజరాజేశ్వరి, యువజన వ్యవహారాల అధికారి నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.