
80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
పోలీస్ పరేడ్ మైదానంలో ఆగస్టు 15 న ఘనంగా జరిగే 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రత, బందోబస్తు మరియు పోలీసుల కవాతు రిహార్సల్స్ ను జిల్లా ఎస్పీ గారు పరిశీలించారు. రిహార్సల్స్ లో భాగంగా ముందుగా సిబ్బంది నుండి జిల్లా ఎస్పీ గారు గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకం ఎగుర వేశారు. అనంతరం కవాతు పరిశీలన వాహనంలో వెళ్లి సాయుధ పోలీసు బలగాల పరేడ్ ప్రదర్శన పరిశీలించి కవాత్ ను నిర్వహించడంలో కొన్ని సూచనలు, మెళుకువలు సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు మరింత ఉత్సాహంగా కవాతు ప్రదర్శన చేయాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీస్ కవాతు, శకటాల ప్రదర్శన, తదితర వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, విద్యార్థులు, ప్రజలకు కల్పించాల్సిన భద్రత & సౌకర్యాలను సమీక్షించి, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు పలు సూచలను తెలియచేసారు. ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ఏఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఒంగోలు టు టౌన్ సీఐ వీర నాయక్ ఒంగోలు రూరల్ సీఐ శేషారిగి రావు, ఒంగోలు ట్రాఫిక్ సీఐ హాజరత్తయ్య, ఆర్ఐలు సీతారామిరెడ్డి,సురేష్ బాబు, ఆర్ఎస్ఐలు ఏఆర్ ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు.