
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
చీమకుర్తి ఎస్ఐ గారు మరియు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు తూర్రగుడిపాడు గ్రామ శివారులో జూదం నిర్వహిస్తున్న స్థావరంపై దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.4,700/- నగదును స్వాధీనం చేసుకున్నారు.జూదం, బెట్టింగ్ మరియు ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చీమకుర్తి పోలీసులు హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.