
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం శ్రీ గోదాదేవి అమ్మవారి తిరునక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు, కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృత స్నపనం నిర్వహించగా, సాయంత్రం 6 గంటలకు శ్రీ గోదాదేవి అమ్మవారి కల్యాణ మహోత్సవం జరిగింది. దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబోయిన శ్రీనివాసులు (నాయుడు) ఆధ్వర్యంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం భక్తులకు శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అర్చకులు ఉదయగిరి వెంకట శేష లక్ష్మీ నరసింహాచార్యులు, అర్చకులు ఉదయగిరి లక్ష్మీ నరసింహాచార్యులు, యోగానంద, ఉభయదాత వెంకటేశ్వర్లు–శివకుమారి దంపతులు, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, గ్రామస్థులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.