
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
శ్రీ వివేకానంద హైస్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కాకుమాని మాల్యాద్రి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, న్యాయవాది సన్నెబోయిన శ్రీనివాసులు, న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ముఖ్య అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటంలో యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, స్వాతంత్ర్య సమరయోధుల జీవిత విశేషాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు తెలిపారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాకుమాని మాల్యాద్రి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.