
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ: స్థానిక దాచూరి రామిరెడ్డి–అనసూయమ్మ ప్రజాసంఘాల కార్యాలయంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయురాలు సామంతుల అజయ్ సంపత్ కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు టంగుటూరి రాము, పి. రవికుమార్, పి. బాబురావు, డి. శ్రీనివాస్, వల్లూరి రవి, జేవీవీ నాయకులు కోటపాటి నక్క శ్రీను, వల్లభూని మోహన్ తదితరులు పాల్గొన్నారు.