
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు శాఖకు సంబంధించి డిప్యూటీ ఎంపీడీవో విభాగంలో సింగరాయకొండకు చెందిన దార వెంకటరావు ప్రకాశం జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా దార వెంకటరావు అభినందన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.
డిప్యూటీ ఎంపీడీవోగా ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఎంపిక చేయడం పట్ల స్వర్ణ గ్రామం–స్వర్ణ వార్డు సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, పంచాయతీ అభివృద్ధి అధికారులు తదితరులు దార వెంకటరావును అభినందించారు.