
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం :-
గత ప్రభుత్వంలో పునాదులకే పరిమితమైన ఈ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశాం. అంతేకాదు.. బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశాం. రెండేళ్లలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో రూ.57.57 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరవ్వడమే కాకుండా, రూ.45 కోట్లు బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి కేటాయిస్తున్నట్లు మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు ప్రకటించడం చాలా సంతోషకరం. నా వెంట నిలుస్తూ బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.బుచ్చిరెడ్డిపాళెంను మరింత అభివృద్ధి చెందిన, సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దే వరకు ఇదే వేగంతో పనిచేస్తాను.