
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
ముండ్లమూరు మండలం పురిమెట్ల గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులకు దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ గారు సైకిళ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డా. లక్ష్మీ గారు మాట్లాడుతూ.. దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో దర్శి నియోజకవర్గంలో ఇప్పటికే వందలాది సైకిళ్లు పంపిణీ చేశామని తెలిపారు.సైకిళ్లతో విద్యార్థుల సమయం ఆదా కావడంతో పాటు, పాఠశాల హాజరు మరియు చదువుపై మరింత దృష్టి పెరుగుతుందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్తు అనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.విద్యార్థులకు సైకిళ్లు అందించిన వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఆమె అభినందించారు.