
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
అసెంబ్లీ సందర్శనకు విచ్చేసిన కనిగిరి ZPHS గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులతో అసెంబ్లీ ఆవరణంలో కొంత సమయం మమేకమై, వారితో ఆప్యాయంగా మాట్లాడిన గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు గారితో కలిసి కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మరియు ఎర్రగొండపాలెం టిడిపి ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అసెంబ్లీ కార్యక్రమాలు, ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు శాసనసభ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.విద్యార్థుల్లో ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలు మరియు సామాజిక బాధ్యతను పెంపొందించే ఇలాంటి సందర్శనలు ఎంతో ప్రేరణనిస్తాయి.