
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ మండలం కలికివాయి గ్రామం లో నిర్వహించినటువంటి పొలం పిలుస్తోంది కార్యక్ర వానికి గౌరవనీయులైన జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాస రావు పాల్గొని కలికి వాయి రైతులకు ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న Elnino ప్రభావం గురించి వివ రించి రైతులు తక్కువ నీటితో సాగుచేసే పంటల కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సూక్ష్మ పోషకాల వినియోగాన్ని పెంచాలని తెలియజేసినారు.
ఈ ఖరీఫ్ మరియు రాబోయే రబీ కాలానికి రైతులు చేయబోయే పంటలకు ఎరువులు APAIMS యాప్ ద్వారానే తీసుకొనుట జరుగును కాబట్టి అందరూ వేసిన పంటలను కచ్చితంగా ఉంటా నమోదు, ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సింది గా తద్వారా మాత్రమే ప్రభుత్వం అందించేటువంటి రాయితీలకు అర్హులు అవుతారని తెలియజేసినారు.
ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి టీ పూర్ణచంద్రరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి సిహెచ్ వెంకట్రావు, గ్రామ ఉద్యాన సహాయకులు సిహెచ్. సుజాత, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటరమణ ,గ్రామ పెద్దలు గనిపినేని శ్రీనివాసులు, వల్లెపు కోటేశ్వరరావు, తన్నీరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు