
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు డివిజన్: జీవనజ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో ఉప్పుచెరువు 5వ లైన్‌లోని నూతన యెరూషలేం ప్రార్థన మందిరంలో మదర్ థెరీసా 116వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించినట్లు సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ తెలిపారు.ఈ సందర్భంగా మదర్ థెరీసా చిత్రపటానికి గులాబీ పూలమాల వేసి ఆమెను ఘనంగా స్మరించుకున్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి అందరికీ కేక్‌ను పంచారు.ఈ కార్యక్రమంలో జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చ్ ట్రెజరర్ జంగాల ప్రభు కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మదర్ థెరీసా పేదలు, అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, రోగులు, దిక్కులేని వారి పట్ల దయ, కరుణ, ప్రేమతో సేవలు అందించారని కొనియాడారు. బాధల్లో ఉన్నవారిని ఆదరించి, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం ద్వారా ఆమె మానవత్వానికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. మదర్ థెరీసా చూపిన ప్రేమ, దయ, సేవా మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.అనంతరం, రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దాతలు అందించిన రగ్గులను జేడీబీఎం టౌన్ బాప్టిస్ట్ చర్చ్ స్త్రీల సమాజం జాయింట్ ట్రెజరర్ వనజా ప్రభు కుమార్ చేతుల మీదుగా వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు, నిరాశ్రయులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ బాబు, నితీష్, వేణుబాబు, శివ, పాస్టర్ కుడుముల సామేలు, లలితమ్మ తదితర సంఘస్తులు పాల్గొన్నారు.