
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఈ నెల 31వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెలిగొండ ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా, దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద ముఖ్యమంత్రి గారి పర్యటన మరియు బహిరంగ సభా ఏర్పాట్లను మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.,గారితో పాటు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు,మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గారు మరియు ఇతర అధికారులతో కలిసి ముందస్తు భద్రత సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల రూట్ మార్గమును పరిశీలించారు.ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం, బహిరంగ సభా స్థలం, వాహనాల పార్కింగ్ ప్రాంతాలు, ఫీడర్ కెనాల్, జలహారతి జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు, సీఎం కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని కూడా పరిశీలించారు. బందోబస్తు, భద్రతా చర్యలపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు చేశారు.ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి, తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా ఎస్పీ గారు సూచించారు. హెలిప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు, ప్రజా వేదిక మరియు ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ గారు ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, మార్కాపురం ఓఎస్డి(అడ్మిన్) నవజ్యోతి మిశ్రా ఐపీఎస్ గారు,ఎర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ జి.ఏరిక్షన్ బాబు, మార్కాపురం డి.ఎస్.పి యు. నాగరాజు, ఎస్ బి ఇన్స్పెక్టర్ యం. శ్రీనివాసరావు వైపాలెం సీఐ కె అజయ్ కుమార్, రెవిన్యూ అధికారులు, వెలిగొండ ప్రాజెక్టు అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.