
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రతి ఒక్కరిపై ఉందని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి అనేది అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి ప్రకాశం జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన నియంత్రణ సమీకృత వ్యూహం దిష క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ ఎస్కే అమీన్ పేర్కొన్నారు బుధవారం హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ బివి సాగర్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, దిశ, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ, గ్రో, సమన్వయంతో ఒంగోలు కర్నూల్ రోడ్ లోని సెయింట్ జేవియర్స్ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటెన్సిఫైడ్ ఐఇసి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది, ఎస్కే అమీన్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యార్థి దశ నుండే వివిధ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది ఆ వ్యాధి సంక్రమించుకున్న ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని, ఈ అవగాహన కార్యక్రమాల్లో మీరు తెలుసుకున్న విషయాలను మీ మీ ప్రాంతాల్లో ప్రజలకి విషయాలను చేరవేసి ఏ ఒక్కరు కూడా హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ బాధితుల పట్ల వివక్షత చూపించకూడదని వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న ఏ ఆర్ టి వైద్య సేవలు గురించి తెలియజేయడం, ఎవరైనా హెచ్ఎవి బాధితులు సక్రమంగా మందులు వాడుకున్న మధ్యలోనే ఆపేసినట్లయితే వారు క్రమం తప్పకుండా మందులు వాడుకునే విధంగా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వారికి ప్రభుత్వ పథకాలు చేరువ ఆయె విధంగా, మరియు హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత బాలలకు, తల్లిదండ్రులు కోల్పోయిన బాలలకు ఉచిత విద్య వైద్యం ఆర్థిక సహాయ సహకారాలు అదేవిధంగా చూడవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు సి.ఎస్. ఓ ఎస్ సాయి మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై తగు సూచనలు సలహాలు కొరకు జాతీయ టోల్ ఫ్రీ1097 పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించాలని హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులు యొక్క వివరాలను గోప్యంగా ఉంచాలి అని వారి విషయాలు బహిర్గతం చేయకూడదని పేర్కొన్నరు ఈ కార్యక్రమంలో సెండ్ జేవియర్స్ బాలికల జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎమ్. రోస్ మేరీ గ్రో స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ ఎస్ కె పీర్ భాష అవుట్ ఇచ్ వర్కర్ ఎస్ కె బ్రాహ్మణి కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు…..