
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
పొదిలిలోని ఓ వివాహ కార్యక్రమానికి పాల్గొనటానికి హైదరాబాదు నుండి రోడ్ మార్గంలో వస్తున్న మాజీ మంత్రి,జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని మార్కాపురం జిల్లా కేంద్రం లోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ వద్ద మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటక సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక కూటమి నాయకులు,అభిమానులు అట్టహాసంగా ఘన స్వాగతం పలికారు..అనంతరం దృశ్యాలువలు,
పూలమాలలతో సన్మానించారు..ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కాపురం నియోజకవర్గంలో జరుగుతున్న కూటమి కార్యకలాపాలపై విస్తృతంగా గుంటక సుబ్బారెడ్డి, వెంకటరమణ రావు తో బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చించారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండి,కూటమి అభ్యర్థుల విజయం కోసం తోడ్పడాలని సూచించారు..ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటక సుబ్బారెడ్డి తో పాటు బేస్తవారిపేట ఎంపీపీ వేగినాటి ఓసురా రెడ్డి,మాజీ డీ ఆర్ యు సి సి మెంబర్ ఎం.ఎన్.రెడ్డి,అక్కి పుల్లారెడ్డి,గంట రామకృష్ణారెడ్డి,మద్దాలి కృష్ణ,పద్మాకర్,జన తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు..