
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్ :-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిస్సింగ్ మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ట్రేస్ చేసి సంబంధిత యజమానులకు అప్పగించారు.తర్లుపాడు పీఎస్ ఎస్ఐ గారు మిస్సింగ్ మొబైల్ ఫోన్ను ట్రేస్ చేసి ఫిర్యాదుదారునికి అప్పగించారు. అదేవిధంగా కె.కె.మిట్ల పీఎస్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మిస్సింగ్ అయిన 22 మొబైల్ ఫోన్లను, రూ.2,25,000/- విలువైన మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి రికవరీ చేసి సంబంధిత యజమానులకు అప్పగించారు.మిస్సింగ్ మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి బాధితులకు తిరిగి అందించిన పోలీసు సిబ్బందిని అధికారులు అభినందించారు. ప్రజల ఆస్తి, భద్రత పరిరక్షణకు ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.