
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష మనిద్దరం దేశానికి రక్ష అంటూ చిన్నారులు ముందస్తు రాఖీ వేడుకలను అంబరాన్నంటే సంబరంగా నిర్వహించుకున్నారు
ఒంగోలు మండలం కరవధి వివేకానంద విద్యావిహార్లో గురువారం సాయంత్రం రాఖీ పండుగ వేడుకలను నిర్వహించారు
ముందుగా పాఠశాల హెచ్ఎం రమాదేవి రాఖీ పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు సోషల్ టీచర్ చరిత్రలో రాఖీ పండుగ అనే అంశంపై విద్యార్థులకు వివరించారు
అనంతరం విద్యార్థులు వేడుకగా రాఖీలు కట్టుకొని మిఠాయిలు పంచుకున్నారు
కార్యక్రమానికి డి పవిత్ర, డి రమ్య ,డి బాలాజీ, దీక్ష, అంకిత, ప్రసన్న, వర్ష, జగన్, అజయ్ సాయి రాఘవ, గీతిక బ్రైటి నాయకత్వం వహించారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
హయగ్రీవ జయంతి, విఖనసము ని జయంతి ప్రాముఖ్యతను విద్యార్థులకు పాఠశాల కరస్పాండెంట్ వివరించారు