
తొలి శుభోదయం న్యూస్ కొవ్వూరు నియోజకవర్గం :-
వి.పి.ఆర్ నేత్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్ నేత్ర కార్యక్రమం ద్వారా పేద, సామాన్య ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, అవసరమైన వారికి ఉచిత కళ్లద్దాలు అందిస్తున్నాం.కోవూరు నియోజకవర్గంలో ఇప్పటికే కొడవలూరు, విడవలూరు, కోవూరు, ఇందుకూరుపేట మండలాల్లో సేవలు పూర్తికాగా, గురువారం నుంచి బుచ్చిరెడ్డిపాళెం అర్బన్, శాంతినగర్లో ఐదో మండలంగా వి.పి.ఆర్ నేత్ర సేవలను నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ప్రారంభించాను.కోవూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 36,134 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 24,817 మందికి ఉచిత కళ్లద్దాలు అందించాం. జిల్లా వ్యాప్తంగా 1,10,317 మందికి కంటి పరీక్షలు, 64,760 మందికి ఉచిత కళ్లద్దాలు అందించడం ఎంతో సంతోషంగా ఉంది.ప్రతి ఒక్కరికీ మెరుగైన కంటి చూపు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సేవలను పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.ప్రజల వద్దకే వెళ్లి సేవలందిస్తున్న విపిఆర్ నేత్ర మరింత మందికి కంటి వెలుగులు అందించాలని ఆకాంక్షిస్తున్నాను.