
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండ: వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరాయకొండ కందుకూరు రోడ్డులోని మూడు బొమ్మల సెంటర్ సమీపంలో ఘనంగా నిర్వహించారు.పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో, VHPS మండల కన్వీనర్ సన్నిబోయిన నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సమితి జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కొండేపి నియోజకవర్గ MRPS సమన్వయ కార్యకర్త పూనూరి కృష్ణా ఫర్ మాదిగ మాట్లాడుతూ.. దివ్యాంగుల హక్కులు, ఆత్మగౌరవం కోసం మందకృష్ణ మాదిగ చేస్తున్న కృషిని కొనియాడారు.కార్యక్రమంలో VHPS, MRPS, MSP, MMS, MEF, MLF అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.