
తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
విజన్ యూనిట్లు ఏర్పాటు చేసి ఏడాది పూర్తైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన పీ4 కార్యక్రమం సమీక్ష వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నాను.పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పీ4 ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అందుతున్న సహాయ సహకారాలు, విజన్ యూనిట్ల ద్వారా నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేద కుటుంబాల సంక్షేమంపై ముఖ్యమంత్రి గారు సమీక్షించారు.కోవూరు నియోజకవర్గంలో కూడా పీ4 కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తాను.