
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ప్రకాశం జిల్లా ఒంగోలు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, జిల్లా ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఒంగోలులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.▪️ ర్యాడిసన్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ
▪️ నగర సుందరీకరణ పనుల పరిశీలన
▪️ 20 మంది నగర ప్రముఖుల విగ్రహాల ఆవిష్కరణ
▪️ అమృత్-2 పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పైలాన్ ఆవిష్కరణ ఈ కార్యక్రమాల్లో మంత్రి బాల శ్రీ వీరాంజనేయ స్వామి గారు, ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు, జిల్లా టీడీపీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు, జిల్లా పరిశీలకులు మద్దిపాటి వెంకటరాజు గారు, ఒంగోలు ఎమ్మెల్యే దామాచర్ల జనార్దన్ గారు, రవిశంకర్ గ్రూప్ చైర్మన్ రవిశంకర్ గారు పాల్గొన్నారు.వారితో కలిసి దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.అభివృద్ధి పథంలో ఒంగోలు… ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం!