
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, పెద్దారవీడు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు బెల్ట్ షాపుపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 37 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.