
మద్దిపాడు మండలం నందిపాడు గ్రామ పొలాల్లో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకున్న పోలీసులు – రూ.4,710 నగదు స్వాధీనం
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మద్దిపాడు పోలీసులు జూదం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నందిపాడు గ్రామ పొలాల్లో జూదం ఆడుతున్నారనే సమాచారం మేరకు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో జూదం ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.4,710/- నగదు మరియు జూదానికి ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.జూదం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.