
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభంతో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల ప్రజల 30 ఏళ్ళ కలను సాకారం చేసిన కూటమి ప్రజా ప్రభుత్వం దోర్నాల మండలం గంటవాని పల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు సొరంగాల నుంచి వచ్చిన కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి జల హారతి ఇచ్చి స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నల్లమల కొండల్లోని రెండు సొరంగాల నుంచి గంటవాని పల్లె ఆక్విడెక్టుకు చేరుకుని నల్లమల సాగర్ కు కృష్ణమ్మ పరుగులు
వెలిగొండ తొలిదశ ప్రాజెక్టు తో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి తాగునీరు వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున హాజరైన ఆ ప్రాంత రైతులు, ప్రజలు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు,జలహారతి కార్యక్రమానికి హాజరైన కందుల దుర్గేష్, పార్ధసారధి, అనగాని సత్యప్రసాద్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎంపీ మాగుంట తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు