
రూ.1 కోటి విరాళం ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అవసరమైన సామగ్రిని సమకూర్చేందుకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రారంభించిన “విద్య – వసతి – వికాసం” వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది.జిల్లాలోని 155 ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న సుమారు 19 వేల మంది విద్యార్థులకు మెరుగైన వసతి, విద్యా సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి సోమవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ, తన వంతు సహకారంగా అందిస్తున్న రూ.1 కోటి విరాళంతో జిల్లాలోని 155 సంక్షేమ వసతి గృహాలకు అవసరమైన కంప్యూటర్లను కొనుగోలు చేసి అందజేస్తామని తెలిపారు.రూ.1 కోటి విరాళాన్ని ప్రకటించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి దాతల నుంచి విశేష స్పందన లభించడం సంతోషకరమైన విషయమని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి దాదాపు రూ.5 కోట్ల మేర విరాళాలు అందాయని కలెక్టర్ పేర్కొన్నారు. పేద, నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమానికి సహకారం అందించదలచిన దాతలు తనను లేదా జిల్లా బీసీ సంక్షేమాధికారి శ్రీమతి వెంకటలక్ష్మిని సంప్రదించవచ్చని,