
తొలి శుభోదయం న్యూస్ నెల్లూరు:-
స్థానిక యువత సొంత డబ్బుతో పార్కు అభివృద్ధి చేయడం అభినందనీయం: నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. సీఎం చంద్రబాబు గారి P4 స్ఫూర్తిని పెమ్మారెడ్డిపాళెంలో యువత నిజం చేసి చూపించారు: కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. పెమ్మారెడ్డిపాళెంలో రెండేళ్లలో రూ.63.08 లక్షల అభివృద్ధి పనులు గ్రామాభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్, వీపీఆర్ ఫౌండేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తాం: ఎంపీ సొంత గ్రామం అభివృద్ధి కోసం యువత ముందుకొచ్చి, తమ సొంత డబ్బు, కష్టంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రతి గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు. పెమ్మారెడ్డిపాళెంలో కొడవలూరు తెలుగుదేశం యువత అధ్యక్షుడు సూర్య, స్థానిక యువత సహకారంతో అభివృద్ధి చేసిన పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ గారు, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు పాల్గొన్నారు.