
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేసిన దర్శి టీడీపీ ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ. ప్రతి నెల 1వ తేదీనే పింఛన్లు అందిస్తూ.. పేదల ముఖాల్లో చిరునవ్వులు నింపుతున్న కూటమి ప్రభుత్వం.అనంతరం ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా బొట్లపాలెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.