
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
హైదరాబాద్‌లోని పార్క్ హోటల్లో ఆదివారం నిర్వహించిన World Education Enclave కార్యక్రమంలో Koding Caravanకు “Best Edutech Platform” అవార్డు లభించింది.విద్యార్థులకు Artificial Intelligence (AI), Robotics, Coding, App Making, App Development వంటి ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను ప్రాక్టికల్‌గా అందిస్తూ, సృజనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార సామర్థ్యం, ఇన్నోవేషన్‌ను ప్రోత్సహిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించారు.‘The Business Ascent’ కవర్‌పేజ్‌పై లక్ష్మణరావుకు ప్రత్యేక గౌరవం ఇదే కార్యక్రమంలో ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘The Business Ascent’ కవర్‌పేజ్‌పై శ్రీ లక్ష్మణరావుకు ప్రత్యేక గౌరవం లభించింది. ఆయన జీవిత ప్రయాణం, సాధించిన విజయాలు, విద్యా–సాంకేతిక రంగంలో చేసిన కృషి, Koding Caravan ఆవిర్భావం, సంస్థ ప్రస్థానం, భవిష్యత్ లక్ష్యాలపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు.Learning by Doing విధానంతో విద్యార్థులను భవిష్యత్ టెక్నాలజీకి సిద్ధం చేయాలనే లక్ష్యంతో Koding Caravan తన కార్యక్రమాలను విస్తరిస్తోంది.“Best Edutech Platform” అవార్డుతో పాటు ‘The Business Ascent’ కవర్‌పేజ్ గౌరవం Koding Caravan ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది.