
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం, మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మహిళలు, బాలికల భద్రతను దృష్టిలో ఉంచుకుని ‘శక్తి యాప్’ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు, బాలికలకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్, మహిళలపై నేరాల నివారణ, వ్యక్తిగత భద్రత, స్వీయ రక్షణ చర్యలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి వేధింపులు లేదా అసౌకర్యకర పరిస్థితులు ఎదురైనా భయపడకుండా ధైర్యంగా స్పందించాలని సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను వెంటనే సంప్రదించే విధానం, ‘శక్తి యాప్’ ద్వారా అందుబాటులో ఉన్న భద్రతా సదుపాయాలను ఎలా వినియోగించుకోవాలో వివరించారు. మహిళలు, బాలికలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తమ భద్రతను మరింత బలోపేతం చేసుకోవాలని పోలీసులు సూచించారు.మహిళల భద్రతే మా బాధ్యత – ప్రతి మహిళా, ప్రతి బాలిక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.