
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో దర్శి టీడీపీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు గారు, కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు.ఈ సందర్భంగా డా. గొట్టిపాటి లక్ష్మీ గారు మాట్లాడుతూ.. కూటమి సఖ్యతను ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, వైసీపీ కుట్రలకు కూటమి నేతలు బలికావద్దని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువనేత శ్రీ నారా లోకేష్ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. వెలిగొండ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తవుతుండటం కూటమి ప్రభుత్వ అభివృద్ధికి నిదర్శనమన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటి, ఐక్యతతో అభివృద్ధి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో OG టీమ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.