
తొలి శుభోదయం న్యూస్ దర్శి :-
దర్శి పట్టణం సందువారిపాలెంలోని టీడీపీ బూత్ ఇన్చార్జ్ చిమ్మా ఆదినారాయణ గారు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న దర్శి టీడీపీ ఇన్చార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేశారు. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, కనకం శ్రీను, చెన్నంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.