
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
త్రోవగుంట గ్రామంలో జూదంపై ఉక్కుపాదం.. రూ.9,800 నగదు, మొబైల్ ఫోన్ స్వాధీనం ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీసులు త్రోవగుంట గ్రామంలో జూదం జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేకంగా దాడి నిర్వహించారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.9,800/- నగదు మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.జూదం, బెట్టింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా, తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.జూదానికి నో ఎంట్రీ – అసాంఘిక కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసుల ఉక్కుపాదం!