
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ దివి శివరాం సోమశిల జలాశయంతో పాటు గొట్టిపాటి కొండపనాయుడు కాలువ ఉత్తర కాలువ వెడల్పు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ ద్వారా సాగునీరు అందుతున్న తీరును, ప్రస్తుతం కొనసాగుతున్న పనుల పురోగతిని ఆయన పరిశీలించి సంబంధిత వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.సోమశిల ప్రాజెక్టు ద్వారా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్న నేపథ్యంలో కాలువల అభివృద్ధి, పెండింగ్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ దివి శివరాం పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కాలువ వెడల్పు పనులు పూర్తయితే మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందే అవకాశం ఉందని తెలిపారు.కాలువల నిర్వహణ, పూడికతీత, అవసరమైన చోట్ల మరమ్మతులు చేపట్టి నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా ప్రభుత్వం, నీటిపారుదల శాఖ సమన్వయంతో చర్యలు చేపట్టాలని డాక్టర్ దివి శివరాం సూచించారు సోమశిల ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల విభాగం వివరాల ప్రకారం ఉత్తర కాలువ సోమశిల జలాశయం నుంచి ప్రారంభమై పలు మండలాలకు సాగు, తాగునీటిని అందిస్తోంది.