
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు లోని శ్రీ గుర్రం వారి పాలెం లో ఉన్న శ్రీ సంస్కృతి స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పాఠశాల ఆవరణంలో గురువారం అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాఠశాల చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు , శ్రీకృష్ణుడు రాధా మరియు గోపికల వేషధారణలో అలరించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుని జన్మాష్టమి సందర్భంగా నృత్యాలు చేశారు.
వేడుకల్లో భాగంగా ఏర్పాటు
చేసిన 'ఉట్టి కొట్టే ' కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టిని పగులగొట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ కొంకా చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, విద్యార్థులకు చదువుతోపాటు మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగల విశిష్టతను తెలియజేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి భగవద్గీత జ్ఞానం నేడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందని మరియు మానవాళికి ఎంతో మేలు చేకూరుస్తుందని అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హరి , వైస్ ప్రిన్సిపల్ శోభారాణి,ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.