
తొలి శుభోదయం న్యూస్ కొండేపి నియోజకవర్గ:-
కొండపి క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను స్వయంగా తెలుసుకుని వినతిపత్రాలను స్వీకరించారు.ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.