
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు: శ్రీ గాయత్రీ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను వైభవంగా కందుకూరులోని రెండు క్యాంపస్‌లలో నిర్వహించారు. శ్రీ గాయత్రీ ఒలింపియాడ్ స్కూల్ (గాయత్రీ భవన్–3), శ్రీ గాయత్రీ ఈ-టెక్నో స్కూల్ (గాయత్రీ భవన్–5) లో నిర్వహించిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి.ఈ కార్యక్రమానికి శ్రీ గాయత్రీ గ్రూప్స్ చైర్మన్ చింతలచెరువు రామకృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను అభినందించారు. ఆయనతో పాటు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చింతలచెరువు భరద్వాజ్, ఆయన సతీమణి శ్రీమతి చింతలచెరువు వైష్ణవి కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రెండు క్యాంపస్‌లలోని ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సహా సిబ్బంది సభ్యులందరినీ శ్రీ గాయత్రీ విద్యాసంస్థల యాజమాన్యం సన్మానించి, వారి సేవలను కొనియాడింది.అనంతరం రెండు క్యాంపస్‌లకు చెందిన సిబ్బంది, ప్రిన్సిపాళ్లు, AGM శ్రీ *బొడ్డూ సురేష్ కలిసి ముఖ్య అతిథులను వైభవంగా సత్కరించారు.విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కళా ప్రదర్శనలను ముఖ్య అతిథులు, యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ చింతలచెరువు రామకృష్ణారావు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, ఉపాధ్యాయుల సేవలు సమాజ నిర్మాణంలో అత్యంత విలువైనవని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషిని గుర్తించి వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.వేడుకల్లో రెండు క్యాంపస్‌ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
