
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు సిపిఎం కార్యాలయం నందు కందుకూరు మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం కందుకూరు పట్టణ నాయకురాలు ఎస్.కె మున్వర్ సుల్తానా అధ్యక్షత వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బి సురేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైసిపి, టిడిపి వారు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటున్నారు తప్ప ఎన్నికలు పెట్టే విధంగా ప్రయత్నం చేయటం లేదని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు లేకపోతే లోకల్ బాడీ లు కౌన్సిలర్లు, చైర్మన్లు ఉండరని ప్రభుత్వం వైపు నుండి రావాల్సిన 15 ఆర్థిక సంఘం నిధులు కూడా రావటం లేదని తెలిపారు. తక్షణమే ఎన్నికలు జరపాలని కోరారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఎస్ఐ గౌస్ మాట్లాడుతూ సుమారు 12 సంవత్సరాల నుండి ఎన్నికలు జరగకపోవడం రాజ్యాంగ విరుద్ధమని కందుకూరు మున్సిపాలిటీ ఎన్నికలు జరగకపోవడానికి ప్రజలు కారణం కాదని, అధికార ప్రతిపక్ష పార్టీలని వారి వలన ఎన్నికలు జరగడం లేదని అన్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇద్దరూ కోర్టులో ఉన్న కేసులను ఉపసంహరించుకొని పట్టణానికి మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. కౌన్సిలర్లు లేకపోవడం వల్ల ప్రజల సమస్యలు చర్చకు రావని అధికారులు ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ చెప్పినవి అమలు చేయ పరిస్థితి ఉన్నదని అందువల్ల సామాన్య ప్రజలకు న్యాయం జరగదని సమస్యలు పరిష్కారం కావు అలాగే ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు ఆగిపోతుందని మున్సిపాలిటీకి ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనే వివరాలు కూడా తెలియని అన్నారు. కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ సమన్వయకర్త చింతనబోయిన నరేష్ మాట్లాడుతూ 2012 నుండి ఎన్నికలు ఈ పాలకుల తప్పిదాలని వాటిని సరి చేసుకోవాలని కోరారు. మున్సిపాలిటీ ఎన్నికలు లేకపోవడం వల్ల పట్టణ అభివృద్ధి ఆగిపోతుందని ప్రజల సమస్యలు పరిష్కారం కావని తక్షణమే మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. బి ఎస్ పి మహిళా కన్వీనర్ జె మాధవి మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు తక్షణమే జరపాలని వార్డుల్లో కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల అధికారుల చుట్టూ తిరగవలసి వస్తుందని ప్రజల భాగస్వామ్యం ఉంటలేదని తక్షణమే మున్సిపల్ ఎన్నికలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డిఎం రాయుడు పాల్గొన్నారు.