
గ్రామాల్లో మార్పు తెచ్చారంటూ స్థానికుల ధన్యవాదాలు
మోచర్ల ఎస్సీ కాలనీలో పర్యటించిన ఇంటూరి
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు నియోజకవర్గం:-
రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాన్ని గుడ్లూరు మండలం మోచర్ల ఆదిఆంధ్ర కాలనీలో ఆదివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు, కూటమి ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఈ రెండేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా చేశారని కాలనీవాసులు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించారు. గ్రామాల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని కొనియాడారు. మోచర్ల పంచాయతీలో 66.2 లక్షలతో అభివృద్ధి పనులు చేయగా, సంక్షేమ పథకాల అమలు కోసం 12.28 కోట్లు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఈ సందర్భంగా వెల్లడించారు. 26.66 లక్షలతో మూడు సీసీ రోడ్ల నిర్మాణం, 14.48 లక్షలతో పెద్ద చెరువు తూము మరియు సాగునీటి కాలువలను పునరుద్ధరించామని చెప్పారు. పంచాయతీ, మండల పరిషత్ ద్వారా 25 లక్షలు ఖర్చుచేసి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. సంక్షేమానికి సంబంధించి ప్రతినెలా వివిధ రకాల పింఛన్ల కోసం 21.79 లక్షలు మంజూరు అవుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. తల్లికి వందనం పథకం ద్వారా 476 మందికి 1.42 కోట్లు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 576 మంది రైతులకు 1.55 కోట్ల రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. పోలేరమ్మ తల్లికి ఎమ్మెల్యే పూజలు కార్యక్రమం అనంతరం గ్రామంలో పోలేరమ్మ తల్లి పొంగళ్ల సందర్భంగా…. ఎమ్మెల్యే నాగేశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. స్థానికులను పలకరిస్తూ వారితో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమాల్లో మండల టిడిపి అధ్యక్షుడు జనిగర్ల నాగరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు మద్దసాని శ్రీను, పార్టీ నాయకులు మద్దసాని వెంకటేశ్వర్లు, దారా వెంకట్రావు, గోచిపాతల కోటేశ్వరరావు, తాటిపర్తి సునీల్, తలకాయల శేషయ్య, షేక్ పెదబాబు, చిత్తారి మల్లికార్జున, యర్రంశెట్టి వెంకటేశ్వర్లు, గద్దగుంట రామకృష్ణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.