
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా కందుకూరు జీవన జ్యోతి దివ్యాంగ వికాస సేవా సమితి ఆధ్వర్యంలో కనిగిరి రోడ్డులో వరలక్ష్మి నగర్లో గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారుల మధ్య జంగాల ప్రేమ్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.సేవా సమితి కార్యదర్శి శీలం వెంకటేష్ మాట్లాడుతూ, కవనెంట్ చర్చి పాస్టర్ సామేల్ గారు ఈ వేడుకల్లో పాల్గొని, “సంవత్సరమను నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు” అనే దైవ సందేశాన్ని అందించారని తెలిపారు. అనంతరం జంగాల ప్రభుకుమార్, వనజకుమారి గారి సహకారంతో పరగుంటపాడు సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జంగాల ప్రేమ్ బాబు తన పుట్టినరోజు సందర్భంగా నిరుపేద చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి కేక్ పంచిపెట్టి, చిన్నారులకు, అక్కడి నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా కాకుండా నిరుపేద చిన్నారుల మధ్య జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సేవాభావం, మానవతా విలువలు పెంపొందుతాయని తెలిపారు.ఈ వేడుకల్లో సేవా సమితి అధ్యక్షుడు చనమాల శ్రీనివాసరావు, సౌందర్యరాజ్, నితీష్, మణి, నవీన్, దివాకర్, వేణు బాబు, శివ, తదితరులు పాల్గొన్నారు.