
ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్, మోహన్ పిలుపు
కరపత్రం ఆవిష్కరణ ఒంగోలులో
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డి ఏ,హెచ్ ఆర్ఏ, ఇంక్రిమెంట్లతో కూడిన సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2026 సెప్టెంబర్ 12వ తేదీ ఏలూరులో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఆర్, మోహన్ కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు, మంగళవారం ఒంగోలు పట్టణంలోని ప్రగతి కాలనీలో రాష్ట్ర సదస్సు ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు, ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్ మోహన్ మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలు మున్సిపల్ గ్రామపంచాయతీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల తొ పాటు ఆశ,అంగన్వాడి వంటి స్కీమ్ వర్కర్లకు కూడా ఎలాంటి హక్కులు లేకుండా వె ట్టి చాకిరి చేయిస్తూ శ్రమ దోపిడి చేస్తున్నారని, ఒక పర్మినెంట్ ఉద్యోగి రిటైర్ అయితే ఆ స్థానంలో పర్మినెంట్ ఉద్యోగితొ భర్తీ చేయకుండా కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో భర్తీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు,అనేక సంవత్సరాలుగా కాంట్రాక్టు,అవుట్ సోర్సింగ్ కార్మికులు,ఉద్యోగులు పర్మినెంట్ చేయాలని పోరాడుతున్నారు,చంద్రబాబు కూటమి ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు, మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న ఒడిస్సాతొ పాటు, తమిళనాడు పంజాబ్, కర్ణాటక ఢిల్లీ తదితర రాష్ట్రాలలోఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులనుపర్మినెంట్ చేశారని, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పర్మినెంట్ చేయకుండా కేంద్రంలోని ఫాసిస్ట్ పాలకుల అడుగుజాడల్లో నడుస్తుందని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని లేనియెడల కార్మికుల ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని కామ్రేడ్ ఆర్. మోహన్ హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి సిహెచ్, మోజెస్, పి, ఎలీషా, డానియేలు, తదితరులు పాల్గొన్నారు