
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణములోని కోవూరు రోడ్డులో గల జైనేంద్ర ఫిజియోథెరపీ క్లినిక్ లో మంగళవారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవ వేడుకలు ఫిజియోథెరపిస్ట్ బాబు పర్రె ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లినిక్ లో కేక్ కట్ చేసి రోగులకు పంచిపెట్టారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు పాలేటి కోటేశ్వరరావు, హైదరాబాద్ అపోలో హాస్పటల్ ఫిజియోథెరఫిస్ట్ చప్పిడి హరిత కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడిన రోగులకు ఫిజియోథెరపీ ద్వారా నయం చేయడానికి సులభంగా ఉంటుందన్నారు. పక్షవాతం హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారికి కూడా ఫిజియోథెరపీ సరైన మార్గంలో ఉపయోగపడుతుందన్నారు. మెడ నొప్పి,కండరాలు పట్టి వేయడం, వెన్నుపూస నొప్పులు బారిన పడిన వారికి ఫిజియోథెరపీ ద్వారా సులభతరంగా వైద్యం అందుతుందని తెలిపారు. రోగులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకుండా సకాలంలో ఫిజియోథెరపీ వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం ఉత్తమ మార్గము అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కందుకూరు డివిజన్ మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం నాయకులు, న్యాయవాది లింగాబత్తిన బ్రహ్మయ్య, న్యాయవాది దారా మాధవరావు, వలేటి వారి పాలెం మండలం మాల మహానాడు మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొమ్మల ధర్మయ్య, ఎర్ర మాల నాగభూషణం, పల్నాటి చెన్నయ్య, నత్త నాగరాజు, చిన్నయ్య,వైద్యశాల సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.