
4 మొబైల్ ఫోన్లు ట్రేస్ – 2 ఫోన్లు సంబంధిత యజమానులకు అప్పగింత
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
కంభం పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ అయిన 4 మొబైల్ ఫోన్లను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ట్రేస్ చేసి గుర్తించారు.వాటిలో 2 మొబైల్ ఫోన్లను సరైన ధృవీకరణ అనంతరం సంబంధిత యజమానులకు అప్పగించారు. మిగిలిన మొబైల్ ఫోన్లను కూడా సంబంధిత వ్యక్తులకు అందజేసేందుకు తదుపరి చర్యలు కొనసాగుతున్నాయి.పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి తిరిగి అందజేయడంలో కృషి చేసిన కంభం పోలీసులను బాధితులు అభినందించారు.సాంకేతిక పరిజ్ఞానంతో సమర్థవంతమైన పోలీసింగ్ – ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.