
టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్‌తో నేర నియంత్రణకు పటిష్ట చర్యలు – ప్రజల భద్రతకు నిరంతర నిఘా
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
మార్కాపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పెద్దారవీడు పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా ముఖ్యమైన ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాలు, జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ డ్రోన్ నిఘాను చేపట్టారు. అనుమానాస్పద కదలికలు గుర్తించినప్పుడు వెంటనే స్పందించేలా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.టెక్నాలజీతో నిఘా – నేరాలపై ఉక్కుపాదం – ప్రజల భద్రతే లక్ష్యం.