
యంత్రాంగం సమస్య పరిష్కారం చెయ్యకపోతే ఉద్యమం ఉధృతం.
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
ఉన్నత విద్యావకాశాలు పొందేందుకు కనిగిరి ప్రయివేటు స్కూల్ విద్యార్థి నవోదయ ప్రవేశార్హత కొరకు ప్రత్యేక కోచింగ్ తీసుకునేందుకు సింగరాయకొండ మండలం మూలగుంట పాడు శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో చేరిన తౌషిక్ అనుమానాస్పద మృతి సంచలనం కలిగించింది. సరిగ్గా పాకల బీచ్ ఫెస్టివల్ జరిగే సమయం లో ఈ కోచింగ్ సెంటర్ వసతి గృహం లోని బాత్ రూమ్ లో హంగర్ హుక్ కి టవల్ తో ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన తల్లిదండ్రుల ఫిర్యాదు తో అనుమానాస్పద మృతి గా కేసు నమోదు అయింది. అక్కడి నుండి ఈ సంఘటన పై ప్రజా సంఘాలు, హక్కుల సంఘాల జోక్యం దాచూరి రామిరెడ్డి భవనం లో రౌండ్ టేబుల్ సమావేశం, శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ వసతి గృహం, ప్రాథమికోన్నత పాఠశాల లో నిజనిర్ధారణ కమిటీ పర్యటన తో సమస్య వెలుగు చూసింది. అక్కడి నుండి అనేక పరిమాణాలు చోటు చేసుకోవడం విచారణ అధికారి మార్పు, జిల్లా కలెక్టర్ త్రిసభ్య కమిటీ నియామకం, కోర్టు జోక్యంతో నెల్లూరు జిల్లా సంయుక్త పోలీస్ అధికారి ప్రత్యేక విచారణ, సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జులా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో బృందం పర్యటన, న్యాయ విచారణ కి డిమాండ్ చోటు చేసుకున్నాయి. ఒకవైపు కోర్టులో క్రిమినల్ కేసు , మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు త్రిసభ్య కమిటీ సిఫారసు లతో రద్దు చేసిన పాఠశాల అనుమతి రద్దు పై న్యాయం చేయాలని యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల తో జిల్లా విద్యాశాఖ అధికారి తిరిగి అనుమతి ఇవ్వడం తో మృతుడి తల్లి తనబిడ్డ మరణానికి కారణం అయిన అనుమతి లేని నవోదయ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోచింగ్ సెంటర్ ఎదుట నిరసన దీక్ష చేపట్టడం చర్చనీయాంశం కావడం మీడియా లో ప్రసారం ప్రచారం కావడం తో ప్రాధాన్యత సంతరించుకుంది. తమ విద్యాసంస్థ ఎదుట నిత్యం నిరాహార దీక్ష చేస్తూ కోచింగ్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న మృతి చెందిన విద్యార్థి తౌషిక్ తల్లి సమాచారాన్ని ప్రసారం చేస్తున్న మీడియా ప్రతినిధి పై ఏకంగా కోచింగ్ సెంటర్ యాజమాన్యం సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం మీడియా ప్రతినిధులకు ఆగ్రహం కల్పించింది. దానితో మీడియా ప్రతినిధుల ఆగ్రహానికి ఒక అడుగు దిగివచ్చిన యాజమాన్యం తన ఫిర్యాదును వాపస్ తీసుకుంది. ఇంతటితో ఆగలేదు యధా ప్రకారం మృతుడు తౌషిక్ తల్లి, బంధువులు కోచింగ్ సెంటర్ ఎదుట నిరాహార దీక్ష కొనసాగించారు. ఇది ఇలా ఉండగా ఈ సమస్య పై బాధిత తల్లి దండ్రులు వై ఎస్ ఆర్ సి పి జాతీయ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి తమకు న్యాయం చేయాలని, న్యాయ సహాయం చేయాలని కోరారు. కొండపి నియోజకవర్గం ఇంచార్జి మాజీ మంత్రి డా ఆదిమూలపు సురేష్ బాధిత విద్యార్థి తౌషిక్ తల్లి దండ్రులు తమ వద్దకు పిలిపించుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బి సి వై పార్టీ వ్యవస్థాపకుడు బోడే రామచంద్ర యాదవ్ తమ మద్దతు ప్రకటించి తన వంతుగా న్యాయదహకారం అందిస్తానని హామీ ఇవ్వడం తో కొంత మేర ఊరట కలిగింది. ఆదిలో చేయి ఇచ్చిన సి పి ఎం తిరిగి ఇప్పుకు రంగంలో దిగి కోచింగ్ సెంటర్ వద్ద నిరసన దీక్ష చేస్తున్న తౌషిక్ తల్లి బంధువుల వద్దకు వెళ్ళి టంగుటూరి రాము తమ పార్టీ మద్దతు ప్రకటించి వెంటనే సమస్య పరిష్కరించాలని అనుమతి లేకుండా నిర్వహించే కోచింగ్ సెంటర్, వసతి గృహం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చెయ్యని పక్షంలో తమ నాయకత్వం లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా సంబంధిత విద్యాశాఖ అధికారులు మీనమేషాలు లెక్క పెట్టడం విమర్శలకు దారి తీస్తుంది. కొడుకును కోల్పోయి న్యాయ పోరాటం చేస్తూనే, తమ కుమారుడు మృతికి కారణం అయిన నవోదయ కోచింగ్ సెంటర్ అనుమతి రద్దు చేయాలని సంబంధిత కోచింగ్ సెంటర్ వద్ద ప్రత్యక్ష నిరసన దీక్ష చేస్తున్న మౌలాభి కి మద్దతు ప్రకటించిన వారు ఆప్రాంతం లో కనిపించక పోవడం తో ఎంతకాలం ఈ దీక్ష కొనసాగుతుందో అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు మౌలాభి దీక్ష ని పరిశీలిస్తే ముందుకు నెట్టారు వెనక్కు తగ్గారు అన్న సామెతను గుర్తు చేస్తుంది.