
తొలి శుభోదయం న్యూస్ తూర్పు నాయుడుపాలెం :-
కొండపి నియోజకవర్గానికి చెందిన 83 మంది లబ్ధిదారులకు రూ.67,88,176 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి గారు పంపిణీ చేశారు.ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఒక వరంలాంటిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ, కష్టకాలంలో భరోసా కల్పిస్తోంది.ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నామని మంత్రి గారు తెలిపారు.