
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూర్ టౌన్ లోని ట్రాన్స్ జెండర్స్ తో కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్లో కందుకూరు సిఐ షేక్ అన్వర్ భాష కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ ఎవరు కూడా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, దౌర్జన్యంతో డబ్బులు వసూలు చేయకూడదని, గృహప్రవేశాలు మరియు ఫంక్షన్స్ వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేయరాదని, సత్ప్రవర్తనతో ఉండాలని హెచ్చరించారు . ఎవరైనా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టినట్లయితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు . ఈ కౌన్సిలింగ్ నందు కందుకూరు సీఐ తో పాటు, కందుకూరు పట్టణ ఎస్ఐ, కందుకూరు పోలీస్ స్టాప్ పాల్గొన్నారు.