
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతో అరెస్టు చేసి 53 రోజులపాటు నిర్బంధించడం నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.సెప్టెంబర్ 9 తెలుగు జాతి చరిత్రలో ఎన్నటికీ మరచిపోలేని చీకటి రోజుగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించిన రోజును గుర్తు చేసుకుంటూ దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 53 కొవ్వొత్తులను వెలిగించి “నిజం గెలిచింది” అంటూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అనంతరం రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు “నిజం గెలవాలి” అంటూ ఆయనకు అండగా నిలిచారని అన్నారు. ప్రజల నుంచి లభించిన మద్దతు చంద్రబాబుపై తెలుగు ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.ఎన్ని కుట్రలు, అవరోధాలు ఎదురైనా చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, ప్రజాసేవను ఎవరూ అణచివేయలేకపోయారని తెలిపారు. చివరికి నిజం, ధర్మం, న్యాయం గెలుస్తాయనే విషయం మరోసారి రుజువైందన్నారు.ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి–సుబ్బారావు, మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, మారెళ్ల వెంకటేశ్వర్లు, టౌన్ టీడీపీ అధ్యక్షులు పుల్లలచెరువు సత్యనారాయణ (చిన్న), మునగా శ్రీనివాసరావు, దేవతి మహానంద, సందు వెంకటరావు, పూసల ఓబయ్య, కౌన్సిలర్లు, వార్డు, గ్రామ పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.