
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) కందుకూరు నందు బుధవారం వినాయక చవితి పర్వదినాన పర్యావరణ అనుకూల వినాయకుడి విగ్రహాలు వాడాలని ముఖ్యంగా వివిధ రకాల విత్తనాలతో తయారుచేసిన వినాయకులను వాడటం ద్వారా వాటిని నిమజ్జనం చేసినప్పుడు ఆ విత్తనాలు ద్వారా అనేక రకాల మొక్కలు పెరగడానికి దోహదపడుతుందని చెప్పి విద్యార్థిని విద్యార్థులకు వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకులు శ్రీ డి. రాజశేఖర్, డాక్టర్ ఎన్. తిరుపతి స్వామి తెలియజేశారు. ఈ విషయాలను ఒక పాంప్లెట్ రూపంలో తయారుచేసి పట్టణంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వినాయక చవితి నాడు వాడే పత్రిలో, ఉన్నటువంటి మొక్కలు మరియు వాటిలోని ఔషధ గుణాలను పోస్టర్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థిని విద్యార్థులు అవగాహన కల్పించారు. ప్రతి మొక్కలోనూ కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయని వాటిని అందరూ తెలుసుకొని అవగాహన కలిగించుకోవాలని తెలియజేశారు. ఇటువంటి అవగాహన కార్యక్రమాన్ని తమ కళాశాల వృక్ష శాస్త్ర విభాగం ఏర్పాటు చేయటం ఎంతో సంతోష దాయకమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవి కుమార్ తెలియజేశారు. పండగను ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవడంతోపాటు, ఆ సందర్భంగా వాడుతున్న వివిధ రకాల మొక్కలలోని సుగుణాలను తెలుసుకోవడం ఎంతో విజ్ఞానదాయకమైన అంశం అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పోస్టర్ ప్రజెంటేషన్ చేసిన విద్యార్థినీ విద్యార్థుల్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎన్వి శ్రీహరి, డాక్టర్ కె వి పద్మావతి, డాక్టర్ పి. రాజగోపాల్, శ్రీ కే. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
