
తొలి శుభోదయం న్యూస్ కంభం:-
జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు మండల స్థాయి జన విజ్ఞాన వేదిక చెకుముకి సైన్స్ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం వీరనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన మండల స్థాయి చెకుముకి పరీక్షలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల , తురిమెళ్ళ విద్యార్థులు (యాసీన్, దినేష్ ,జగదీష్) మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించారు. అలాగే ప్రైవేట్ పాఠశాల విభాగం నందు ఆల్ఫా హై స్కూల్ ,కంభం విద్యార్థులు( విక్రాంత్ రెడ్డి, శ్రీహరి, ఉపేంద్ర రెడ్డి) ప్రథమ స్థానం సాధించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక కంభం మండల శాఖ అధ్యక్షులు వరికుంట్ల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నారపరెడ్డి రమణారెడ్డి, చెకుముకి కన్వీనర్ షేక్ నాయబ్ రసూల్ ,ఉపాధ్యక్షులు పార్థసారథి, రమణ ,యూత్ నాయకుడు జావిద్ వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.